బీసీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో బీసీ లందరూ తమ ఓట్ల ను బీసీ అభ్యర్థులకే వేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వరరావు కోరారు. విజయవాడ కోమల విలాస్ సెంటర్ లోని బిసి కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నుండి మాజీ ఎమ్మెల్యే మనవరాలు స్వతంత్ర అభ్యర్థి గా పోటీ సిద్ధమయ్యారని ప్రకటించారు.