విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కొంతమంది నాయకులు ఇన్ని రోజులు జనసేనలో ఉండి, నేడు తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారన్నారు. ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటుంటే కళ్లు తెరుచుకుంటున్నాయని అన్నారు.