ఈ నెల 15వ తేదీ శనివారం సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు నిర్వహించనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం తెలిపారు. విజయవాడలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాజధాని వెంకటపాలెంలో ఉన్న శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ బోర్డు మెంబర్లతో కలిసి శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు.