బాలుడిపై మొసలి దాడి.. కాపాడిన గొర్రెల కాపరులు (వీడియో)

562చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చంబల్ నదిలో స్నానం చేస్తున్న బాలుడిపై మొసలి దాడి చేసింది. అక్కడే ఉన్న గొర్రెల కాపరులు అప్రమత్తమై కర్రలతో మొసలిని తరిమికొట్టారు. మొసలి దాడి చేయడంతో అతడి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

సంబంధిత పోస్ట్