AP: పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనుంది. దీనికి సంబంధించిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరారు.