AP: కూటమి సర్కార్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం వేడుక నిర్వహించాలని నిర్ణయించింది. ‘కూటమి ఏడాది పాలన’ను రాష్ట్రస్థాయి వేడుకగా జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కార్యక్రమం నిర్వహించాలని పేర్కొంది. గురువారం సాయంత్రం ఈ వేడుకలు జరగనున్నాయి.