AP: ఆదివాసీ, గిరిజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ కొనసాగుతోంది. 1/70 చట్టాన్ని సవరించాలన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా ఈ బంద్ చేపట్టారు. గిరిజన సంఘాలు తలపెట్టిన ఈ బంద్ కు విపక్ష వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ బంద్ రేపు కూడా కొనసాగానున్నట్లు తెలుస్తోంది.