అకౌంట్లోకి రూ.13 వేలే.. రూ.2 వేలు కట్!

80చూసినవారు
అకౌంట్లోకి రూ.13 వేలే.. రూ.2 వేలు కట్!
AP: కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం నిధుల్ని విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున నగదు జమ చేస్తోంది. అయితే ప్రభుత్వం రూ.15 వేలు కాకుండా.. రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది. ప్రతి విద్యార్థికి ఇస్తున్న మొత్తంలో రూ.2000 తగ్గించి రాష్ట్రంలో విద్యాపర్యావరణ వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి ఉపయోగించనుంది. ఈ డబ్బును జిల్లా కలెక్టర్ అకౌంట్‌లో జమ చేయనుంది.

సంబంధిత పోస్ట్