సూపర్-6కు కట్టుబడి ఉన్నామని, ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇచ్చిన హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామన్నారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం పని చేయాలనుకుంటే కలెక్టర్లకే చక్కటి అవకాశం అన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో 50 శాతం భూ సమస్యలే ఉన్నాయన్నారు. సంపద సృష్టికి కొత్త విధానాలు అవలంభించాలని కోరారు.