ఆపరేషన్ సిందూర్‌పై భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉగ్రవాది బిన్ లాడెన్‌ను అమెరికా వేటాడి అంతమొందించిన ఘటనతో ఆపరేషన్ సిందూర్‌ను పోల్చారు. భారత్ మునుపెన్నడూ లేని విధంగా పాకిస్థాన్‌లోకి చొచ్చుకొని వెళ్లి మరీ ఉగ్రమూకలను ఏరిపారేసిందని చెప్పారు. 2 మే 2011న అమెరికా దళాలు ఇదేవిధంగా వ్యవహరించాయని లాడెన్ పేరు ప్రస్తావించకుండా ధన్‌ఖడ్ మాట్లాడారు