గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌బేస్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. "ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగించలేదు. ఇప్పటి వరకు జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే. సరైన సమయం వచ్చిందంటే, అసలైన చిత్రాన్ని ప్రపంచానికి చూపిస్తాం" అని పేర్కొన్నారు. శాంతి స్థాపనకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అలాగే పాక్ IMF నుంచి తెచ్చుకున్న అప్పును కూడా ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి వాడుతుందని ఆరోపించారు.