AP: ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ హాలిడేస్‌పై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అన్నారు. ఆప్షనల్ హాలిడేస్ స్కూళ్లకు కాదని, ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని ఆయన చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ బడుల్లో కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయరామరాజు హెచ్చరించారు.