ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్న చాలా మందికి ఇటీవల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఒకటి ఆర్డర్ పెడితే మరొకటి రావడం, ఫుడ్‌లో పురుగులు, ఆహారం పాడైపోవడం వంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ యువతికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాను స్విగ్గీలో వెజ్ శాండ్‌విచ్ ఆర్డర్ చేయగా అందులో చికెన్ కనిపించింది. దీనిని యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అసహనం వ్యక్తం చేసింది.