ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై 6 నెలల నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంల వంటి ముఖ్యమైన విద్యుత్ విభాగాల్లో ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఏపీ అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ESMA), 1971 ప్రకారం ఈ ఉత్తర్వులు తీసుకున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. ఈ ఆదేశాలు మే 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.