మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో మాత్రమే ఇతర భాషలను మాట్లాడాలని పేర్కొంది. మరాఠీ వాళ్లతో మాత్రం మరాఠీనే మాట్లాడాలని స్పష్టం చేసింది.