మా సంస్థ తుర్కియే అధ్యక్షుడి కుమార్తెకు చెందింది కాదు: సెలెబి

81చూసినవారు
మా సంస్థ తుర్కియే అధ్యక్షుడి కుమార్తెకు చెందింది కాదు: సెలెబి
భారత విమానాశ్రయాల్లో భద్రతా సేవలందిస్తున్న సెలెబి ఏవియేషన్‌కు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్‌ రద్దు చేసిన నేపథ్యంలో, కంపెనీ స్పందించింది. తమది తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ కుటుంబానికి చెందిన సంస్థ కాదని, తమ సంస్థకు ఎర్డోగాన్‌ కుమార్తె సుమయ్య ఎర్డోగాన్‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది. తమ మాతృ సంస్థలో 65% వాటా కెనడా, US, UK, సింగపూర్‌, UAE, పశ్చిమ యూరప్‌ దేశాలకు చెందినవేనని పేర్కొంది.

సంబంధిత పోస్ట్