మారోజు వీరన్న విద్యార్థి నాయకుడిగా, గాయకుడిగా ప్రగతిశీల విద్యార్థి విభాగాన్ని నడిపించి, క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమించారు. పాలకులను కదిలించి, సామాజిక న్యాయం కోసం పోరాడారు. మండల్ కమిషన్ ద్వారా బీసీలకు 27% రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఆధిపత్య కులాల తప్పుడు ఉద్యమాన్ని ఎదిరించి, మండల్ అనుకూల ఉద్యమంలో ముందుండి నడిపించారు. సామాజిక సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేశారు.