'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిలిపివేత

70చూసినవారు
'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిలిపివేత
AP: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ.. అనంతరం దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేసింది. ఎన్నికలకు ఏడాది ముందు ఈ కార్యక్రమాన్ని జగన్ సర్కార్ చేపట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన 7నెలల అనంతరం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ట్యాగ్స్ :