ఉగాది నుంచి P4 విధానం ప్రారంభం: చంద్రబాబు

56చూసినవారు
ఉగాది నుంచి P4 విధానం ప్రారంభం: చంద్రబాబు
AP: రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఉగాది రోజున పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్ (పీ4) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విధి విధానాలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్థికంగా టాప్‌లో ఉన్న 10 శాతం మంది పేదలకు చేయూతనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, ఇతరులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్