AP: భారత్ అభివృద్ధిని చూసి పాకిస్తాన్ అసూయ పడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పాక్ ఓర్చుకోలేకే ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని పవన్ వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశభక్తి అంటే ఏమిటో సైనికుడు మురళీ నాయక్ చూసి చూపించారని అన్నారు. మురళీ నాయక్ లాంటి వాళ్ళే దేశానికి కావాలని పవన్ తెలిపారు. ఇది కొత్త భారతం అని పాకిస్తాన్ గ్రహించాలన్నారు.