అద్దంకి: సినీ గేయ రచయితకు పురస్కారం
అద్దంకిలోని వాసవి కళ్యాణ మండపము నందు ఆదివారం పుట్టం రాజు బుల్లయ్య రామలక్ష్మమ్మల విఖ్యాత సాహిత్య పురస్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ అద్దంకి ప్రజలు చూపిస్తున్న ప్రేమ మరవలేదని అన్నారు.