అద్దంకి ఎక్సైజ్ శాఖ పరిధిలో గీత కార్మికుల మద్యం దుకాణాల దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీ వరకు గడువు పొడిగించిందని సీఐ భవాని బుధవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. 8వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని ఆమె సూచించారు. 9వ తేదీ బాపట్లలోని కలెక్టర్ కార్యాలయం నందు లాటరీ తీయడం జరుగుతుందని ఎక్సైజ్ సీఐ భవాని తెలియజేశారు.