అద్దంకి మాజీ ఎమ్మెల్యే శనివారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గురించి చంద్రబాబు నాయుడు గరటయ్యను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని గరటయ్య చంద్రబాబుకు వివరించారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజల్లోకి వెళ్లేలా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గరటయ్యకు సూచించారు.