అద్దంకి పట్టణానికి చెందిన విశ్రాంత మిలటరీ ఉద్యోగి సంఘసేవకుడు పతంగి జ్యోతియ్య మృతి చెందిన నేపథ్యంలో బుధవారం ఆయన పార్థివ దేహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జ్యోతియ లాంటి సంఘ సేవకుడిని కోల్పోయామని రవికుమార్ అన్నారు. ఆయన సేవలు మరవలేనివని కొనియాడారు.