అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి గ్రామ సచివాలయాన్ని ఎండిఓ సింగయ్య గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం నందు ఉద్యోగస్తుల హాజరు ను ఆయన పరిశీలించారు. సచివాలయ ఉద్యోగస్తులు సమయపాలన పాటించాలని లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి ఎండిఓ సింగయ్య అడిగి తెలుసుకున్నారు.