అద్దంకి: కుట్టు మిషన్ల శిక్షణను తనిఖీ చేసిన ఎంపీడీవో

61చూసినవారు
అద్దంకి: కుట్టు మిషన్ల శిక్షణను తనిఖీ చేసిన ఎంపీడీవో
అద్దంకి పట్టణంలోని సంజీవయ్య నగర్ లో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఎంపీడీవో సింగయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణకు వస్తున్న మహిళల హాజరు శాతాన్ని ఆయన పరిశీలించారు. శిక్షణ సక్రమంగా తీసుకుంటున్నారా లేదా అని ఎంపీడీవో సింగయ్య మహిళలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కాలం అనంతరం కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యాలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్