అద్దంకిలో మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ శాఖ నందు విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ శుక్రవారం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్ర కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.