ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను తరిమేద్దాం అంటూ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్ ను పంగులూరు ఎంపీడీవో కార్యాలయంలో ఈవో ఆర్డి సుమంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ శివ చెన్నయ్య మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యకర్తలు సమక్షంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు అందిస్తామని తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టాబ్లెట్లను తప్పనిసరిగా వాడాలని సూచించారు