అద్దంకిలోని విద్యాశాఖ కార్యాలయం నందు గురువారం పాఠశాల కమిటీ చైర్మన్ లు, ప్రధానోపాధ్యాయులకు పాఠశాల అభివృద్ధి పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు సుధాకర్ రావు, గంగాధర్ లు పాల్గొని మాట్లాడారు. విద్యా హక్కు చట్టంలో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్ లు పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మంచి గుర్తింపు వచ్చేలా తమ వంతు బాధ్యత తీసుకోవాలని వారు కోరారు.