చీరాల పట్టణంలో గడియార స్తంభం వద్ద ఎన్టీఆర్ విగ్రహం శంకుస్థాపన పై జరుగుతున్న గొడవ గురించి బుధవారం మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైస్ చైర్మన్ జైసన్ బాబు మాట్లాడారు. మాజీ మంత్రి పాలేటి రామారావు గత నాలుగు నెలల నుంచి విగ్రహం ఏర్పాటుపై అర్జీ ఇవ్వటం జరిగిందని అన్నారు. ఎన్టీఆర్ పార్టీలకు అతీతంగా అందరివాడు కాబట్టి అనుమతి ఇవ్వటం జరిగిందన్నారు. దీనిపై రాజకీయాలు తగవని తెలిపారు.