తమ్మవరంలో 150 మందికి ఉచితంగా వైద్య సేవలు

66చూసినవారు
కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామ సర్పంచ్ శివ నాగేంద్రం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు వీరాంజనేయులు పర్యవేక్షణలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణంలో కిమ్స్ వైద్యశాల వైద్యులు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు కట్టా సాయి తేజ పాల్గొని సుమారు 150 మందికి ఉచితంగా షుగర్, ఈసీజీ, బీపీ పరీక్షలను నిర్వహించారు. అనంతరం ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వైద్యులకు, బృందానికి సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్