జె .పంగులూరు: తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి

61చూసినవారు
జె .పంగులూరు: తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి
పంటలలో శిలీంధ్రాలు, కీటకాలను నాశనం చేసేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలని మార్టూరు వ్యవసాయ సహాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పంగులూరు మండలంలోని తూర్పు తక్కెళ్ళపాడు, తూర్పు కొప్పెరపాడు గ్రామాల్లోని సెనగ, మిర్చి, మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. మొలక దశలో ఉండే కీటకాలు తెగుళ్లను నాశనం చేసేందుకు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్