కొరిశపాడు మండలంలో ఎం.ఆర్.పి.ఎస్, ఎం.ఎస్.పి,ఎం.ఈ.ఎఫ్ నాయకులు శనివారం రాత్రి గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎం. ఆర్. పి. ఎస్ మండల అధ్యక్షులు మారుతి ప్రసాద్ మాట్లాడుతూ దళితులు స్థానిక వీఆర్వో సమక్షంలో తమ కులం, విద్యార్హతలను సరిచేసుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిటీ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నందున, కమిటీ చైర్మన్ రాజీవ్ మిశ్రాకు తమ కులానికి సంబంధించిన వినతి పత్రాలు సమర్పించాలన్నారు.