అద్దంకి ఎక్సైజ్ స్టేషన్ ను గురువారం బాపట్ల అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గీత కులాల మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని ఆయన సిబ్బందికి సూచించారు. అలాగే ఇటీవల కాలంలో నమోదు చేసిన కేసుల వివరాలను ఆయన ఎక్సైజ్ సీఐ భవానిని అడిగి తెలుసుకున్నారు.