రెండు రాష్ట్రాల స్థాయి పోటీలోపంగులూరు ఎడ్లకు రెండవ స్థానం

57చూసినవారు
రెండు రాష్ట్రాల స్థాయి పోటీలోపంగులూరు ఎడ్లకు రెండవ స్థానం
పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామంలో నిర్వహించిన పది క్వింటాళ్ల బండలాగుడు పోటీలో పంగులూరు గ్రామానికి చెందిన ఎడ్లజతకు ద్వితీయ బహుమతి లభించింది. నాదెండ్ల గ్రామంలో విజ్ఞేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరిగాయి. పంగులూరు గ్రామానికి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 39,023 అడుగుల దూరాన్ని 15 నిమిషాల్లో లాగి ద్వితీయ స్థానాన్ని పొందాయి.

సంబంధిత పోస్ట్