రబీ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులు వెంటనే తమ పంటలను ఈక్రాప్ చేయించుకోవాలని పంగులూరు మండల వ్యవసాయ అధికారి డి. సుబ్బారెడ్డి కోరారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లోని పంటలను పరిశీలించిన సుబ్బారెడ్డి అనంతరం రైతులతో మాట్లాడారు. రబీ పంటల నమోదు కార్యక్రమం త్వరలో ముగుస్తుందని రైతులు తక్షణమే పంట నమోదు చేయించుకోవాలన్నారు. పంట నమోదు సక్రమంగా జరిగిందా లేదా అని పరిశీలించుకుని ఈ కేవైసీ కూడా చేయించుకోవాలని ఆయన కోరారు.