పంగులూరు మండల పరిధిలోని గ్రామాల్లో వెంటనే శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు చేసి ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో స్వరూప రాణి కోరారు. బుధవారం పంగులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. గ్రామాలన్నింటిలో వెంటనే పనులు మొదలుపెట్టాలని, ఒక్కో గ్రూపుకు 25 నుండి 50 మందిలోపు కూలీలు ఉండాలని ఆమె కోరారు. గ్రామాల్లో ఎక్కువగా రైతు వారి వ్యవసాయ అనుసంధానమైన పనులను చేయించాలని ఆమె కోరారు.