పంగులూరు: బార్లీ పొగాకును కంపెనీల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయించాలి

51చూసినవారు
పంగులూరు: బార్లీ పొగాకును కంపెనీల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయించాలి
బార్లీ పొగాకును ప్రైవేట్ కంపెనీల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలేటి కృష్ణయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం పంగులూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బార్లీ పొగాకు రైతులను మొదట ప్రోత్సహించి సాగు చేయించిన ప్రైవేట్ కంపెనీలు దిగుబడి ఎక్కువ కావడంతో సిండికేట్ అయ్యి ముఖం చాటేశాయని విమర్శించారు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కొనుగోలు చేయించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్