అద్దంకి పట్టణంలో బుధవారం థాంక్యూ మోడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బిజెపి యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పిలుపు మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, పట్టణ అధ్యక్షులు విరాట్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చేతివృత్తుల వారికి కల్పించిన బడ్జెట్ గురించి వారు ప్రజలకు వివరించారు. అలాగే వారందరి చేత థాంక్యూ మోడీ అనే పోస్టుకార్డులు రాయించారు.