సంతమాగులూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

64చూసినవారు
సంతమాగులూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సంతమాగులూరు మండలం పాత మాగులూరు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నరసరావుపేటకు చెందిన శివ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వ్యాపార పనుల నిమిత్తం వినుకొండ వెళ్లి తిరిగి వస్తుండగా పాతమాగులూరు వద్దకు రాగానే ముందు వెళ్తున్న పాల ట్యాంకర్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్