సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎలక్ట్రిషన్ ఈశ్వరయ్య రైతు పొలంలో విద్యుత్ మరమ్మత్తులు చేస్తుండగా అతను ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. దీంతో అతనకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని క్షతగాత్రుడను నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.