సంతమాగులూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. మంత్రి రవికుమార్ మాట్లాడుతూ కళాశాలలోని విద్యార్థులకు మంచి భోజనం అందించాలని లక్ష్యంతో తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.