కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామంలో మంగళవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కట్టా సాయి తేజ తెలియజేశారు. వైద్య శిబిరంలో ఈసీజీ, బిపి, షుగర్ వంటి పరీక్షలు పూర్తిగా ఉచితంగా అందించబడునున్నారు. ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి సంబంధిత మందులను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.