బాపట్ల: ఆక్వా రైతులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి

60చూసినవారు
బాపట్ల: ఆక్వా రైతులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి
బాపట్ల ప్రాంతంలోని ఆక్వా రైతులు తమ చెరువులకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని బాపట్ల జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణ కిషోర్ తెలిపారు. గురువారం కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆక్వా ఇన్సూరెన్స్ పై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆక్వా రైతులు నష్టపోయిన పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ వారికి అండగా నిలుస్తుందని ఆయన తెలియజేశారు. మత్స్యశాఖ సిబ్బంది, మండలంలోని ఆక్వా రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్