బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ వద్ద శుక్రవారం బాపట్ల రూరల్ సీఐ కే శ్రీనివాసరావు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాలను నడిపేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనీ వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.