బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని పోలీస్ స్టేషన్ ను గురువారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆకస్మిక తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని వ్యాపార కూడళ్లలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంపై దృష్టి సారించి ప్రజలకు హెల్మెట్ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాలన్నారు. ట్రైనీ డిఎస్పీ అభిషేక్, రూరల్ సిఐ హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.