దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకే జీరో పావర్టీ పి-4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీక్షణ సమావేశం ద్వారా ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి హాజరయ్యారు. పేదరికాన్ని నిర్మూలించాలనీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.