బాపట్ల పట్టణంలో శనివారం పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించండి- ప్రాణాలు కాపాడుకోండి అంటూ పట్టణంలో ర్యాలీ ప్రదర్శన జరిగింది. బాపట్ల పట్టణ ఎస్ఐ అహ్మద్ జానీ సిబ్బందితో పాల్గొని ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి సురక్షితంగా గమ్యాన్ని చేరండి దయచేసి తలకు హెల్మెట్ ధరించకుండా ఎవరు వాహనాన్ని నడపకండి ప్రమాదాల బారిన పడి ప్రాణాలపైకి తెచ్చుకోకండి అంటూ జాగ్రత్తలను సూచించారు.