బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం దమన్నవారిపాలెం గ్రామానికి చెందిన మన్యం గోపి ఆదివారం రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడన్న సమాచారంతో బాపట్ల రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి బియ్యం లారీని పట్టుకున్నారు. లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. రూరల్ పోలీసులు అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.