బాపట్ల మండలం ఆసోదివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో బసివి రెడ్డి పాలెం గ్రామంలో కోకియలమంద రెడ్డి కి చెందిన పాడి గేదె పిడుగు పడి మృతి చెందింది. శుక్రవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కార్యాలయంలో బాధితుడికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం రూ. 50 వేల చెక్కును అందజేశారు. చెక్కును అందించిన ఎమ్మెల్యేకు కోకియలమంద రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.